సీపీ అభిషేక్ మొహంతి వెల్లడి
మత్తు పదార్థాలు విక్రయిస్తే కఠిన చర్యలు
నార్కోటిక్ జాగిలంతో తనిఖీలు
కరీంనగర్-జనత న్యూస్
కరీంనగర్ పోలీస్ కమీషనరేట్‌లో నార్కోటిక్ సెల్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు సీపీ అభిషేక్ మహంతి. సీపీ ఆదేశాల మేరకు నగరంలో నిషేధిత గంజాయి, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను నిరోదక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా బస్టాండ్ వారణలో విస్తృత తనిఖీలు చేపట్టారు. పార్సెల్ ఆఫీసు, కిరాణా షాపు, పాన్ షాప్, హాస్టల్స్ , అనుమానిత నివాసాల్లో నిషేధిత పదార్థాలు గుర్తించడానికి పోలీస్ తనిఖీలు చేశారు. కరీంనగర్ టౌన్ డివిజన్ ఏసీపీ నరేందర్ ఆధ్వర్యంలో వన్ టౌన్ సీఐ సరిలాల్, సిబ్బందితో పాటు నార్కోటిక్స్ విభాగంలో ప్రత్యేక శిక్షణ పొందిన పోలీస్ జగిలాం (లియో) తో డాగ్ తనిఖీలు చేశారు. హాండ్లర్ కానిస్టేబుల్ శంకర్ కలిసి కొన్ని అనుమానిత ప్రదేశాల్లో తనిఖీలు చేపట్టామని టౌన్ ఏసీపీ తెలిపారు. ఎవరైనా నిషేధించిన గంజాయి, మరే ఇతర మత్తు పదార్థాలు కలిగి ఉన్నా, లేక విక్రయిస్తున్నట్లు సమాచారం వెంటనే డయల్ 100 ద్వారా పోలీసులకి తెలియజేయాలన్నారు. ఇక మీదట కమిషనరేట్ వ్యాప్తంగా ఈ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, పట్టుబడిన వారికి కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.