ఎల్లారెడ్డిపేట-జనత న్యూస్
లయన్స్ క్లబ్ ఆఫ్ ఎల్లారెడ్డిపేట ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్, డీఎంహెచ్‌వో సమక్షంలో శనివారం వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఉదయం ప్రారంభమయ్యే ఈ క్యాంపులో పెద్ద ఎత్తున తరలి వచ్చి వైద్య పరీక్షలు చేసుకోవాలని సూచించారు. ఈ వైద్య శిబిరంలో పలువురు డాక్టర్లు వైద్య పరీక్షలు చేసి తగు సూచనలు చేస్తారని తెలిపారు.