సోషల్ మీడియా, మత్తు పదార్థాలకు బానిస కావద్దు
కరీంనగర్-జనత న్యూస్
సోషల్ మీడియా, మత్తు పదార్థాలకు బానిస కావద్దని పిల్లలు, యువతకు సూచించారు ఛైల్డ్ హెల్ప్‌లైన్ 1098 కో-ఆర్డినేటర్ ఆవుల సంపత్. కరీంనగర్ బైపాస్ రోడ్ మహాత్మా జ్యోతిబా పూలే గర్ల్స్ హాస్టల్, కోతిరాంపూర్ సవరన్ ప్రభుత్వ పాఠశాలలో ఎక్సైజ్ , మహిళా సంక్షేమ శాఖ సంయుక్తంగా సదస్సు నిర్వహించారు. ఆయా కార్యక్రమాలకు ఆవుల సంపత్ హాజరై విద్యార్థులకు పలు సూచనలు చేశారు. స్మార్ట్ ఫోన్, సోషల్ మీడియా ద్వారా విద్యార్థులు,యువత చెడు మార్గాన వెళ్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వాట్సాప్, ఇంస్ట్రాగ్రామ్, స్నాప్ చాట్, యూట్యూబ్, రీల్స్ కి ఎక్కువగా అలవాటు పడి సమయం వృథా చేసుకుంటున్నారని తెలిపారు. 16 నుండి 21 సంవత్సరాల యువత ఎక్కువగా ఇంటర్నెట్‌ను వినియోగిస్తుందని..వివిధ ఆకర్షణలకు లోనై డ్రగ్స్, మత్తు పదార్థాలకు లోనౌతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మంచి పుస్తకాలు చదువుకుని విజ్ఞానాన్ని పెంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ రూరల్ సీఐ లక్ష్మయ్య, అర్బన్ ఎస్ ఐ రాబర్ట్, ప్రిన్సిపాల్ సతీష్, ఔట్రీచ్ వర్కర్ రమేష్, ఎక్సైజ్ శాఖ సిబ్బంది, కళాశాల, స్కూల్ టీచర్స్, విద్యార్థులు పాల్గొన్నారు.