హై కోర్టు ఎజిపి గా రూహీ నబీల నియామకం
హన్మకొండ-జనత న్యూస్
హన్మకొండ జిల్లా కేంద్రానికి చెందిన రూహీ నబీల తెలంగాణ హై కోర్టు అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ గా నియామక మయ్యారు. ఈ మేరకు గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రూహీ ఇంటర్ వరకు హన్మకొండలో చదివి, ఎల్ ఎల్ బి, ఎల్ ఎల్ ఎం ఉస్మానియా యూనివర్సిటీ కళాశాలలో చదివి ఉతీర్ణులయ్యారు. తన తండ్రి మహమూద్ వరంగల్ జిల్లా కోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేసారు. తండ్రి బాటలో నడిచి తండ్రిని మించిన తనయ రుహి నబీల.. 2016 లో తెలంగాణ బార్ కౌన్సిల్ లో పేరు నమోదు చేసుకొని న్యాయవాదిగా కొనసాగారు. మొదట వరంగల్ కోర్టులో , ఆ తరువాత రాష్ట్ర హై కోర్టులో తన ప్రాక్టీసు ప్రారంభించారు. క్రమశిక్షణ, పని విధానం చూసిన తెలంగాణ ప్రభుత్వం ఆమెను ఎజిపి గా నియమించింది. తనపై నమ్మకంతో బాధ్యత అప్పగించిన న్యాయ అధికారులకు, ప్రభుత్వ పెద్దలకు రూహీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా రూహీ నబీలకు కేసముద్రం మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గంట సంజీవరెడ్డి, కాంగ్రెస్ నాయకులు సూరపనేని నాగేశ్వర్ రావు, మాజీ బార్ అసోసియేషన్ అద్యక్షులు ఆనంద్ మోహన్, వరంగల్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు జీవన్ గౌడ్, హన్మకొండ బార్ అసోసియేషన్ నాయకులు జంగ స్వప్న, రమాదేవి, న్యాయవాదులు సాయిని నరేందర్, రెహమాన్, ఆండాలు, రాధిక శర్మ, శిరీష్, పరిస్మిత సైకియా, ముఖ్రం ఖాన్, వెన్నపూజ పరుషరాజ్ తదితరులు అభినందనలు తెలిపారు