ఇతర రాష్ట్రాల రాయితీల పరిశీలన
పవర్ సబ్సిడీపై ప్రభుత్వానికి నివేదిక
సిరిసిల్ల-జనత న్యూస్
పవర్ లూమ్ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ రaూ, టెక్స్‌టైల్స్, సెస్ అధికారులు, పవర్ లూమ్ యజమానులతో సమావేశం నిర్వహించారు. పవర్ సబ్సిడీ, కోర్టు కేసు, ఐఎస్‌ఐ యూనిట్ల అంశాలపై విప్ ఆది శ్రీనివాస్ చర్చించారు. పవర్ లూమ్ కార్మికుల సంక్షేమానికి తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని..ఇప్పటికే పలుమార్లు బతుకమ్మ చీరల బకాయిలు చెల్లించిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే స్కూల్ యూనిఫాం క్లాత్ ఆర్డర్ ను కూడా ప్రభుత్వం అందజేసిందని వివరించారు. కోర్టు పరిధిలో ఉన్న అంశాలు మినహా అన్ని సమస్యలు పరిష్కరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. ఇదే విషయమై పలుమార్లు ముఖ్యమంత్రి, మంత్రితో చర్చించామని గుర్తు చేశారు. ఇతర రాష్ట్రాల్లో పవర్ లూమ్ పరిశ్రమకు అందిస్తున్న రాయితీలు, ప్రోత్సాహకాలపై ప్రభుత్వానికి నివేదిస్తామని హామీ ఇచ్చారు. ఇదే విషయమై మరో సారి చర్చిస్తామని విప్ ప్రకటించారు. పవర్ లూమ్ పరిశ్రమలో విద్యుత్ సబ్సిడీ సమస్య పరిష్కరిస్తామని సెస్ చైర్మన్ చిక్కాల రామారావు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బీమ్యా నాయక్, హ్యాండ్లూమ్ అండ్ టెక్స్ టైల్ శాఖ ఏడీ సాగర్, పవర్ లూమ్ యజమానులు, ఆసాములు పాల్గొన్నారు.