సరదాగా..సందడిగా..
నాటి సర్వస్వతి శిశు మందిర్ విద్యార్థులతో..
ఫ్రెండ్‌షిప్ డే వేడుకల్లో బండి సంజయ్
హైదరాబాద్ :
‘‘అరెయ్ రంగన్నా… ఏం చేస్తున్నవ్ రా?…అరే మీరంతా ఎప్పుడొచ్చిర్రు… ఏంది స్సెషల్ ’
‘మంజుల ఫొటోలు మంచిగ రావాలే… లేకుంటే కెమెరా గుంజుకపోతది. అసలే చిన్నప్పటి నుండి టెర్రర్’
‘మీరే ఫోటోలు దిగుతరా…. మాకు ఛాన్సవ్వరా?’
ఇలా చిన్న నాటి స్నేహితులతో సరదాగా గడిపారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. కొద్ది గంటలు..కేంద్ర మంత్రి నని మరచి..స్కూల్ ఫ్రెండ్స్‌తో ఇలా సరదాగా గడిపారు సంజయ్. అంతర్జాతీయ ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా హైదరాబాద్ ఎల్‌బీ నగర్ మన్సూర్ బాద్‌లో నాటి సరస్వతి శిశు మందిర్ స్కూల్ విద్యార్థులతో గత స్మృతులను నెమరు వేసుకున్నారు. అనుకోకుండా వచ్చిన స్నేహితులందరినీ చూసిన బండి సంజయ్.. అందరినీ పేరుపేరునా పలకరిస్తూ, అప్పటి జ్ఞాపకాలను పంచుకున్నారు. చిన్పప్పటి చిలిపి చేష్టలు, చిన్న చిన్న సరదా గొడవలను గుర్తుకు చేసుకున్నారు. ఎవరెవరు..ఎక్కడెక్కడ ఉన్నారని అడిగి తెలుసుకున్నారు. తన చిన్ననాటి స్నేహితుడిని కలవడంతో వారి ఆనందానికి ఆవధుల్లేవు. సంజయ్ బిజీబిజీగా ఉన్నప్పటికీ అక్కడే దాదాపు రెండు గంటలకుపైగా గడిపారు. స్నేహితులంతా కలిసి ప్రత్యేకంగా తీసుకొచ్చిన కేక్ ను సంజయ్ కు తినిపించారు. మరోసారి ఈవెంట్‌లో కలుద్ధామని వెళ్లిపోయారు కేంద్ర మంత్రి బండి సంజయ్.
పుల్లూరి శ్రీనివాసరావు, బండి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రిని కలిసిన స్నేహితుల్లో.. సింగం మీనాకుమారి, బుట్టి మంజుల, కె.లత, పి.శ్రీదేవి, ఎం.శోభారాణి, చెన్నాడి ప్రవీణ్ రావు, తనుగుల శ్రీధర్, తోట ప్రకాశ్, నార్ల మహేందర్, పుల్లూరు రంగారావు, వైద్య సంజయ్, వెల్దండి వేణు మాధవ్, తాటిపల్లి శ్రీనివాస్, ముక్కా శ్రీధర్, భువనగిరి శ్రీధర్, చిటుమల్ల శ్రీనివాస్, గసిగంటి మోహన్, కామారపు నరేందర్, మేడిశెట్టి సంజయ్, చెరుకుతోట శ్రీనాథ్ రావు, రేపాల శ్రీనివాస్, శ్రీరామోజు యోగింద్రనాధ్, కాడర్ల వేణుమాధవ్ ఉన్నారు.