గత ప్రభుత్వ హయాంలో నియామకాల్లేవ్
కాంగ్రెస్ హాయంలోనే ఉద్యోగ అవకాశాలు
ఇచ్చిన మాట ప్రకారమే జాబ్ క్యాలెండర్ విడుదల
కాంగ్రెస్ పార్లమెంట్ ఇంఛార్జి వెలిచాల రాజేందర్ రావు
కరీంనగర్-జనత న్యూస్
గత పదేళ్ల పరిపాలనలో బిఆర్‌ఎస్ నిరుద్యోగులను పట్టించుకున్న పాపాన పోలేదని, ఉద్యోగాలు భర్తీ చేయలేదని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు ఆరోపించారు. శనివారం ఆయన ప్రకటన విడుదల చేశారు. ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసిందని తెలిపారు. జాబ్ క్యాలెండర్ పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు చిల్లరగా మాట్లాడడం తగదని, వారి అవివేకానికి నిదర్శనమని మండిపడ్డారు. నిరుద్యోగులకు న్యాయం చేయడం బీఆర్‌ఎస్‌కు నచ్చదా అని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 32,410 మంది నిరుద్యోగులకు ప్రభుత్వం ఉద్యోగ నియామక ఉత్తర్వులు అందించిందని పేర్కొన్నారు. మరో 13, 505 ఉద్యోగాల నియామకం చివరి దశలో ఉందని తెలిపారు. గత ప్రభుత్వ హాయంలో ఉద్యోగ నియామకాల ప్రకటనలు రద్దు కావడం, వాయిదా వేయడం జరిగిందని గుర్తు చేశారు. ప్రశ్న పత్రాల లీకు, పరీక్షల తేదీల ఓవర్ ల్యాప్ తో నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని విమర్శించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ సమర్థతత వల్ల గ్రూప్ -1 పరీక్ష వాయిదా పడిరదని తెలిపారు. 2023 మార్చి 17న పేపర్ లీకు వల్ల గ్రూప్ -1 పరీక్షను రద్దు అయిందని గుర్తు చేశారు. బీఆర్‌ఎస్ పరీక్షల నిర్వహణ కూడా సరిగా నిర్వహించలేక పోయిందని పేర్కొన్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రక్షాళన చేసిందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఒక ప్రణాళిక బద్ధంగా నిరుద్యోగులు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేలా జాబ్ క్యాలెండర్ ను రూపొందించిందని తెలిపారు. ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఏ ఏ ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తారనేది జాబ్ క్యాలెండర్లో పొందుపరిచిందని వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు.