పట్టణాల్లో నెల సరి ఖర్చు 32.4 శాతం
తగ్గిన మూగ జీవాలు..
జాతీయ కుటుంబ వినియోగ సర్వేలో..
వెలుగులోకి విస్తుపోయే అంశాలు
జనత న్యూస్-కరీంనగర్ ప్రతినిధి
ఏ ఫంక్షన్ అయినా..మనోళ్లకు ముక్క, సుక్క లేకుంటే కుదరదు. అది పల్లె అయినా, పట్టణమైనా..ఎక్కడైనా సరే ! మందు` మాంసం ఉండాల్సిందే. చిన్న ఫంక్షనైనా, పెద్దదైనా..వీటికి ప్రాధాన్యత ఇస్తుంటారు అహార ప్రియులు. ఇక సాధారణ రోజుల్లో సైతం వారానికి ఒకటి, రెండు సార్లు పానీయాలు, చేపలు, గుడ్లు, మేక మాసం తప్పనిసరౌతుంది. వీటితో పాటు ఫాస్ట్‌ఫుడ్ అహారం షరా మామూలే. వీటికి కుటుంబ ఆదాయంలో నెలకు పల్లెల్లో అయితే 23.2, పట్టణాల్లో 32.4 శాతం ఖర్చు చేస్తున్నారట. జాతీయ కుటుంబ వినియోగ సర్వే ఇటీవల ఈ విషయాన్ని వెల్లడిరచింది. తెలంగాణలో అహారం, ఇతర కుటుంబ ఖర్చు సగటున గ్రామాల్లో రూ. 4,802 ఉంటే.. పట్టణాల్లో రూ.8,158 ఉందట. జాతీయ స్థాయిలో పోల్చితే తెలంగాణలో 50 శాతం ఎక్కువగా మాంసం, ఫాస్ట్ ఫుడ్, పానీయాలకు ఖర్చు చేస్తున్నట్లు తేలింది. అయితే..దేశ వ్యాప్తంగా తమిళనాడు మొదటి స్థానం అక్రమిస్తే..తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. మాంసం వినియోగం ఎక్కువ అవుతుండడంతో..రాష్ట్రంలో గొర్లు, మేకల సంఖ్య కూడా గణణీయంగా తగ్గినట్లు తెలుస్తుంది. 2019లో 2,39,88,070 ఉన్న గొర్రెలు, మేకలు.. 2024కు వచ్చేసరికి 1.62 కోట్లకు తగ్గినట్లు సామాజిక, ఆర్థిక సర్వే-2024 గణాంకాలు చెబుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 32 శాతం తగ్గినట్లు ఈ సర్వేలో తేలింది. ఈ లెక్కలను బట్టి పరిశీలిస్తే.. గొర్లు, మేకల మాసం వినియోగం ఎక్కువై..పెంపకం తక్కువైనట్లు అర్థం చేసుకోవచ్చు. మాసం, పానీయాలు ఎక్కువగా తీసుకునే వారు..ఆరోగ్యం కూడా చూసుకోవాలి మరి.