కరీంనగర్-జనత న్యూస్
ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్నా..మహాలక్ష్మి పథకంలో గ్యాస్, విద్యుత్ రాయితీలు వర్తించడం లేదా.? అయితే కరీంనగర్ జిల్లా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ప్రజా పాలన కౌంటర్‌ను సంప్రదించండి ! ఆఫీసు పని దినాల్లో కలెక్టరేట్ లోనికి వెళ్లే దారిలోనే ఓ ప్రత్యేక కౌంటర్ ఉంటుంది. మీ రేషన్ కార్డుగాని, ఆధార్ కార్డు గాని సిబ్బందికి చూపిస్తే చాలు, సమస్య ఎక్కడుందో చెబుతారు. ఒకవేళ సాంకేతిక కారణమై ఉంటే ఇక్కడే పరిష్కరిస్తారు. నగరంలోని, రూరల్ మండలం, కొత్తపల్లి మండలంలోని లబ్ధిదారులు..ఈ కలెక్టరేట్ కౌంటర్ వద్దకు వచ్చి రాయితీలు రాక పోవడానికి గల కారణాలు తెలుసుకుంటున్నారు. మీకూ ఇలాంటి సమస్యే ఉంటే..ఈ ప్రజాపాలన కౌంటర్‌లో సంప్రదించండి !
గ్యాస్, కరెంట్ బిల్లు రాయితీ వర్తించడం లేదా..?
- Advertisment -