Wednesday, July 2, 2025

సమస్త ప్రకృతి శక్తి తత్త్వం

ఆకట్టుకున్న ఆధ్మాత్మిక ప్రసంగం
సువాసినీ పూజల్లో ముతైదువలు

కరీంనగర్‌-జనత న్యూస్‌

సమస్త ప్రకృతే స్త్రీ తత్వమని..అది ప్రపంచాన్ని ముందుకు నడిపిస్తుందన్నారు వేద పండితులు పురాణం మహేశ్వర శర్మ. కరీంనగర్‌ రూరల్‌ మండలం నగునూర్‌లోని శ్రీ దుర్గాభవానీ ఆలయంలో ఆషాడ శాకంబరీ ఉత్సవాలు కొనసాగున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం 108 మంది బ్రాహ్మణ ముతైదువలు సువాసినీ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు పురాణం మహేశ్వర శర్మ అధ్యాత్మిక ప్రసంగం చేశారు. శక్తి సంవిధానాన్ని వివిధ రూపాల్లో ఆరాధించడం సంప్రదాయంగా వస్తున్న మన ఆచారం అన్నారు. శక్తి అనుసారం ఒకరిని నుండి వెయ్యిన్నూట పదహారు మంది వరకు సువాసినీపూజ చేయవచ్చునన్నారు. సలక్షణాలతో ఏవిధమైన అవయవలోపంలేని సౌమ్యమైన బ్రహ్మణ ముతైదువలను అమ్మవారిగా భావించి, షోడశ ఉపచారములతో శ్రీసూక్త విధానంగా సహస్ర, త్రిశతీ, అష్ణోత్తర, ఖడ్గమాల నామములతో అర్చించి, మంగళహారతి ఇచ్చి, ఆభరణ, పుప్ప, హరిద్ర, కుంకుమ చందనాదులతో సత్కరించి వారి ఆశీర్వచనము పొందలాని సూచించారు. దీని వలన భక్తి, జ్ఞాన, విద్యాభివృద్ధి, అష్టశ్వర్య భోగభాగ్యములు సకలశుభములు కలుగుతాయన్నారు. ఈ పూజల్లో ఆలయ ఫౌండర్‌ చైర్మెన్‌ వంగల లక్ష్మన్‌, కార్పోరేటర్‌ వంగల శ్రీధేవి, ఆలయ కమిటి బాధ్యులు, భక్తులు, ముతైదువలు పాల్గొన్నారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page