భక్తుల కోసం అత్యాధునిక 96 వసతి గదులు
ఆగస్టు లో గుడి చెరువు బండ్ పార్క్
వేములవాడ ఆలయ అభివృద్ధిపై సమీక్షలో..
ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ వెల్లడి
వేములవాడ-జనత న్యూస్
శ్రావణ మాసంలో వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి బ్రేక్ దర్శనం ప్రారంభించనున్నట్లు ప్రకటించారు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయ ఈవో గెస్ట్ హౌజ్‌లో జిల్లా కలెక్టర్‌ఖఱ సందీప్ కుమార్ రaూ, ఈవో వినోద్ రెడ్డి లతో కలసి సమావేశ మయ్యారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ..శ్రావణ మాసంలో రాజన్న ఆలయంలో బ్రేక్ దర్శనం చేసుకునే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. గుడి చెరువులో భక్తుల కోసం అత్యాధునిక వసతులతో రూ. 32 కోట్ల అంచనాలతో 96 గదులు నిర్మించనున్నామని, ఈ మేరకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని తెలిపారు. బద్ది పోచమ్మ ఆలయ నిర్మాణ పనుల పురోగతి పై ఆయన అడిగి తెలుసుకున్నారు. గుడి చెరువులో బండ్ అండ్ పార్క్ నిర్మాణంలో భాగంగా ఆగస్టు నెలాఖరులోగా పూర్తి చేస్తామని చెప్పారు. నటరాజ, సూర్య నమస్కారం విగ్రహాలు, ఇంటర్నల్ పాత్ వే, జోన్ వన్ ప్లాంటేషన్ పూర్తి కాగా, లాండ్ స్కేప్, గ్రానైట్ ఫ్లోరింగ్ తదితర 80 శాతం పనులు పూర్తి అయ్యాయని తెలిపారు. వీటీడీఏ పనుల్లో భాగంగా ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో రూ. 2 కోట్లతో మున్సిపల్ పార్క్ నిర్మాణ పనులు తుది దశలో ఉన్నాయన్నారు. రూ. 30 లక్షలతో రాజన్న ఆలయం సమీపంలో అంబేద్కర్ విగ్రహాన్ని తీర్చిదిద్దనునామని మున్సిపల్ కమిషనర్ అన్వేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రాజేశ్వర్, టూరిజం శాఖ డీఈ విద్యాసాగర్, జేఈ జీవన్, ఆలయ ఈఈ రాజేష్, డీఈ రఘునందన్, రామేశ్వర్ రావు, మున్సిపల్ కమిషనర్ అన్వేష్, ఆర్ అండ్ బీ ఏఈ సతీష్, డీటీసీపీఓ అన్సారీ పాల్గొన్నారు.
శ్రావణం నుండి రాజన్న బ్రేక్ దర్శనం
- Advertisment -