ఘనంగా ఆషాడ మాస ఉత్సవాలు
కరీంనగర్-జనత న్యూస్
కరీంనగర్ జిల్లా కొత్తపల్లి అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్‌లో ఆషాడ మాస బోనాల వేడుకలు ఘనంగా జరిగాయి. బోనాల ఉత్సవ్ కార్యక్రమానికి ఆ విద్యా సంస్థల ఛైర్మన్ నరేందర్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. బోనాల జాతరకు విశిష్టత ఉందని, మత సామరస్యతను చాటుతుందని చిన్నారులకు ఆయన వివరించారు. హైద్రాబాద్ లో ఉజ్జేయని మహంకాలి మాతకు బోనం సమర్పించి బోనాల ఉత్సవాలను ప్రజా ప్రతినిధులు ప్రారభిస్తారని గుర్తు చేశారు. వేడుకలలో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన ఆటా`పాట ఆకట్టుకుంది. సుమారు 120 మంది విద్యార్థులు సాంప్రదాయ దుస్తుల్లో బోనాలను ఎత్తుకొని పండుగ వాతావరణాన్ని సృష్టించగా..50 మంది చిన్నారులు పోతురాజుల వేశధారణలో విన్యాసాలు చేసి ఆకట్టుకున్నారు.
పద్మనగర్‌లో..
నగరంలోని పద్మనగర్‌లో ముత్యాల పోచమ్మ బోనాల వేడుక ఘనంగా జరిగింది. ఇంటికో బోనం చొప్పున ఊరేగింపుగా ఆలయం వరకు వెళ్లి అమ్మవార్లకు నైవేద్యం సమర్శించి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ఇందులో మాజీ సర్పంచ్ శ్రీరాములు, మాజీ ఎంపీటీసీ విజయనందన్ అంజలి, కార్పోరేటర్ బోనాల శ్రీకాంత్, భక్తులు పాల్గొన్నారు.
చింతకుంటలో..
కొత్తపల్లి మండలం చింతకుంట ప్రగతి నగర్‌లో పోచమ్మ తల్లి బోనాలు ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకకు కాంగ్రెస్ నాయకులు పురుమల్ల శ్రీనివాస్ హాజరయ్యారు. ముడుపు మోహన చారి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ప్రగతి నగర్ ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ కంకణాల అనిల్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ మడుపు లక్ష్మీ నరసింహ చారి, ములుగు లక్ష్మణ్, అందె శంకర్ తదితరులు పాల్గొన్నారు.