కరీంనగర్-జనత న్యూస్
నగరంలో జగన్నాథ రథయాత్ర నేత్రానందంగా జరిగింది. రాంనగర్ శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక పూజలు చేసి యాత్రను ప్రారంభించారు. రాంనగర్ నుండి ప్రారంభమైన ఈ యాత్ర కమాన్ చౌరస్తా, టవర్ సర్కిల్ మీదుగా వైశ్య భవన్ వరకు కొనసాగింది. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. వివిధ కళా బృందాల ప్రదర్శన ఆకట్టుకుంది. ఈ సందర్భంగా రథయాత్ర నిర్వాహకులు నరహరి ప్రభుజీ భక్తులకు ఆశిర్వచనలు అందజేశారు. ఆద్యాంతం శోభాయాత్ర అత్యంత భక్తి శ్రద్దలతో కొనసాగింది