గన్నేరువరం-జనత న్యూస్
జాతీయ పక్షి నెమలికి రక్షణ కరువైంది. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం మైలారంలో కొంతమంది వేటగాళ్లునెమళ్లను వేటాడి చంపి మాంసం విక్రయించి సొమ్ము చేసుకుంట్లు సమాచారం. తాజాగా జనావాసాలకు సమీపంలో నెమలి ఈకలు కనిపించడం కలకలం రేపింది. వేటగాళ్ల వేటకు నెమలి బలై ఉంటుందని స్థాణికులు భావిస్తున్నారు. వేటగాళ్లు నెమలిని వేటాడగా..చనిపోయిన నెమలిని వీధి కుక్క నోట కర్చుకొని వెల్లినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. మైలారం గుట్ట ప్రాంతంలో అడవి పందులు, కుందేళ్ళను వేటాడి సొమ్ము చేసుకుంటున్నట్లు గతంలో ఆరోపనలున్నాయి. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. తాజాగా చనిపోయిన నెమలి కనిపించడం పట్ల పలువురు పక్షి, జంతు ప్రేమికులు చెందుతున్నారు. అటవీ అధికారులు పక్షుల రక్షణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.