అల్ఫోర్స్‌లో డ్రగ్స్‌పై విద్యార్థులకు అవగాహన
కరీంనగర్-జనత న్యూస్
ఎట్టి పరిస్థితుల్లో తాము మత్తు పదార్థాలకు బానిస కామని ప్రతీణ బూనారు విద్యార్థులు. కరీంనగర్ వావిలాలపల్లి అల్ఫోర్స్ మెయిన్స్ క్యాంపస్‌లో ‘ మత్తు పదార్థాలు`మాదక ద్రవ్యాల నియంత్రణ’ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏసీపీ ఉపేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులచే ఆయన ప్రతిజ్ఞ చేయించారు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివిస్తున్నారని, వారి ఆశలు అడియాశలు చేయవద్దని సూచించారు. కొన్ని ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీల్లో డ్రగ్స్ సప్లై జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. సీఐ కృష్ణమూర్తి మాట్లాడుతూ..గ్రామాల్లో గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. మత్తు పదార్థాల వల్ల జీవితాలు అంథకారంలోకి వెళ్తాయని, పలు సంఘటనలను ఆయన గుర్తు చేశారు. అక్కడ క్కడ కొందరు విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించి డ్రగ్స్‌కు తలవంచి బంగారు భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నారని అల్ఫోర్స్ విద్యా సంస్థల ఛైర్మన్ డాక్టర్ నరేందర్ రెడ్డి తెలిపారు. డ్రగ్స్ నియంత్రణపై తెలంగాణ ప్రభుత్వం ఉక్కు పాదం మోపుతోందని..విద్యార్థులు, ప్రజలు నియంత్రణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో త్ర్రీటౌన్ టౌన్ సి.ఐ జాన్ రెడ్డి, అల్ఫోర్స్ కళాశాల ప్రిన్సిపాల్ రాజేశం , అధ్యపకులు ,విద్యార్థులు పాల్గొన్నారు.