కేంద్ర, రాష్ట్రాల సమన్వయంతోనే అభివృద్ధి
కేంద్రం పక్షాన సంపూర్ణ సహకార బాధ్యత తీసుకుంటా
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో గ్రామాల అభివృద్ధి
కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్
సిరిసిల్ల -జనత న్యూస్
‘ టిట్లు, వ్యక్తిగత దూషనలు..ఆరోపనలు, రాజకీయ విమర్శలు పక్కనబెడుదాం. అభివృద్ధిపై ఫోకస్ బెడుదాం’ అధికార కాంగ్రెస్, ఇతర పార్టీల నేతలకు కేంద్ర మంత్రి బండి సంజయ్ సూచించారు. సిరిసిల్ల పట్టణంలో మున్నూరు కాపు సంఘం కళ్యాణ మండపానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా పలు వ్యాఖ్యలు చేశారు. కేంద్ర, రాష్ట్రాల సమన్వయంతోనే అభివృద్ధి సాధ్యమని..కేంద్ర ప్రభుత్వ నిధుల మంజూరు బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. రెండోసారి ఎంపీగా అత్యదిక మెజారిటీతో గెలిపించడంలో సిరిసిల్ల జిల్లా ప్రజల భాగస్వామ్యం ఉందన్న ఆయన.. రెండోసారి గెలవడంవల్లే మోదీ కేబినెట్ లో చోటు దక్కిందని సంతోషం వ్యక్తం చేశారు. సిరిసిల్ల జిల్లా అభివ్రుద్ధి కోసం అహర్నిశలు క్రుషి చేస్తానని, కేంద్ర ప్రభుత్వం విద్య, వైద్యం, రవాణా, జాతీయ రహదారులు, రైల్వేశాఖలతోపాటు సంక్షేమ రంగాలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. ఆయా రంగాల నుండి నిధులు తీసుకొచ్చి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివ్రుద్ది చేస్తానని భరోసా ఇచ్చారు.
‘‘కేంద్ర ప్రభుత్వం తరపున రాష్ట్రానికి సంపూర్ణ సహాయ సహకారాలు అందించే బాధ్యత నేను తీసుకుంటా. ఎన్నికలైపోయినయ్, ఇకపై ఒకరినొకరు తిట్టుకోవడం బంద్ చేద్దాం. రాజకీయ విమర్శలు, ఆరోపణలను పక్కనపెట్టి అభివృద్ధిపైనే ఫోకస్ చేద్దాం. కేంద్ర, రాష్ట్రాల సమన్వయంతోనే గ్రామాల్లో అభివృద్ధి సాధ్యం. గ్రామాలు, పట్టణాలు అభివ్రుద్ధి చెందితేనే రాష్ట్రం, దేశం అభివృద్ధి సాధ్యం. కేంద్రం పక్షాన సంపూర్ణ సహకారం అందించే బాధ్యత నేను తీసుకునేందుకు సిద్ధం. అందరూ సహకరించాలి’ అని వ్యాఖ్యానించారు కేంద్ర మంత్రి బండి సంజయ్.