స్మార్ట్‌సిటీ పనుల్లో రూ. 10 కోట్ల కమీషన్
మేయర్ సునిల్ రావుకు కాంగ్రెస్ కార్పోరేటర్ల సవాల్
కరీంనగర్ `జనత న్యూస్
స్మార్ట్‌సీటీ రూ. 300 కోట్ల పనుల్లో రూ. 10 కోట్ల కమీషన్ తీసుకున్నారని మేయర్ సునిల్‌రావుపై కాంగ్రెస్ కార్పోరేటర్లు ఆరోపించారు. దీనిపై మున్సిపల్ గేట్ ఎదుట చర్చకు సిద్దం కావాలని సవాల్ విసిరారు. కరీంనగర్ పద్మనగర్ డీసీసీ ఆఫీసులో వారు మీడియాతో మాట్లాడారు. దమ్ముంటే తమ సవాళ్లను స్వీకరించి..బహిరంగ చర్చకు రావాలని డిమాండ్ చేశారు. ఒకప్పుడు ఎమ్మెస్సార్ వెంట, బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక గంగుల కమలాకర్‌తో..తాజాగా కేంద్ర మంత్రి బండి సంజయ్‌తో అంటగాగుతున్నారని మేయర్ సునిల్ రావుపై నిప్పులు చెరిగారు. తాము కాంగ్రెస్‌లో చేరినందుకు పది లక్షలు ఎక్కడ తీసుకున్నామో నిరూపించాలని మేయర్ సునిల్ రావును డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్లమెంటు ఇంచార్జి వెలిచాల రాజేందర్ రావుపై చేసిన ఆరోపనలను ఖండిరచారు. కరీంనగర్‌లో జరిగిన అవినీతిని చూసి ప్రజలు ఆశ్చర్య పోతున్నారని..బీఆర్‌ఎస్ కార్పోరేటర్లే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయాన్ని గుర్తు వారు చేశారు. సీఎం అస్సురెన్స్ పనుల పెండిరగ్ బిల్స్ ఇప్పిస్తామని కాంట్రాక్టర్ల నుండి కమీషన్లు ఆశించింది వాస్తవం కాదా అని నిలిదీశారు. ఈ సమావేశంలో కార్పోరేటర్లు గంట కల్యాణి, శ్రీనివాస్, కాశెట్టి శ్రీనివాస్, ఆకుల ప్రకాశ్, , ఆకుల నరసయ్య నాయకులు పాల్గొన్నారు.