కరీంనగర్ -జనత న్యూస్
తల్లీతో పాటు ముగ్గురు పిల్లలు అదృష్యమైన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కరీంనగర్ రేకుర్తి హనుమాన్ నగర్‌కు చెందిన గోదా భాగ్యలక్ష్మి (40) కూతురు ఆదిత్య లక్ష్మి (12), విశ్వక్ సేన్ (8), అశ్వత్ కార్తికేయ (3) ఇంటి నుండి వెళ్లిపోయినట్లు కొత్తపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు వారి బంధువులు. ఈ నెల 3న ఇంటి నుండి బయటకు వెళ్లి పోయారని తిరిగి రాలేదని పోలీసులు తెలిపారు. భర్త గోదా కృష్ణ బంధువులు, ఇతర ప్రాంతాల్లో ఆరా తీస్తున్న ఆచూకి లభించడం లేదని పేర్కొన్నారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఈ నెల 5న రాత్రి బంధులు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు కొత్తపల్లి ఎస్‌ఐ సామ మూర్తి తెలిపారు. వివాహిత ఐదు అడుగుల ఎత్తు తెలుపు రంగు, కులముఖం కలిగి ఉంటుందని ఆయన తెలిపారు.
తల్లీ ముగ్గురు పిల్లల అదృష్యం
- Advertisment -