కరీంనగర్ -జనత న్యూస్
కరీంనగర్ పోలీస్ కమీషనరేట్‌లో ట్రాఫిక్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ తమ్మననేని కుమార స్వామి(43) అనారోగ్య కారణాలతో చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందాడు. మృతుడికి భార్య ఇద్దరు కుమారులు వున్నారు. 2007వ సంవత్సరంలో కుమారస్వామి ఆర్మ్ రిజర్వు విభాగంలో పోలీస్ కానిస్టేబుల్ గా విధుల్లో చేరి ఇటీవలే సివిల్ కానిస్టేబుల్ గా కన్వర్షన్ అయ్యాడు. బౌతిక కాయాన్ని అంత్యక్రియల నిమిత్తం వారి స్వగ్రామమైన కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం మోత్కులగూడెంకు తరలించారు. ఈ అంత్యక్రియల్లో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఖరీముల్లాఖాన్ పాల్గొన్నారు.ఇందులో జమ్మికుంట ఇన్స్పెక్టర్ రవి, ట్రాఫిక్ ఎస్సై ప్రమోద్ రెడ్డి లతో పాటు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
అనారోగ్యంతో కానిస్టేబుల్ మృతి
- Advertisment -