సిద్దిపేట-జనత న్యూస్
విద్యా సంస్థలు, పిల్లల సంరక్షణ కేంద్రాల సమీప ప్రాంతాల్లో అసభ్య కరమైన ఫోటోలు, వీడియోలు, కర్టున్లూ, ఇతర సామాగ్రీ ఉంచకూడదని జిల్లా సంక్షేమ అధికారి సీహెచ్ శారత హెచ్చరించారు. ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. సుప్రిం కోర్టు, మానవ హక్కుల కమీషన్ ఆదేశాల మేరకు చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అలాగే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, బాలల సంరక్షణ కమిటీలు, పాఠశాల మేనేజ్మెంట్ కమిటీలు, స్వచ్ఛంద సంస్థలు దీనిపై పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. సిద్దిపేట జిల్లాలో పిల్లలు ఎటువంటి చైల్డ్ సెక్సువల్ అబ్యూస్ మెటీరియల్ వినియోగించకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని గుర్తు చేశారు. ముఖ్యంగా పిల్లలు వినియోగిస్తున్న ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్టాప్ లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ చెడు మార్గంలో వెల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులను కోరారు.
అసభ్యకరమైన ఫోటోలు ఉంచకూడదు
- Advertisment -