కరీంనగర్-జనత న్యూస్
అర్థంతరంగా నిలిచి పోయిన నగరంలోని తీగలగుట్టపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు తిరిగి ప్రారంభం అయ్యాయి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చొరవతో పనులు స్పీడప్ చేశారు. ఈ సందర్భంగా స్థాణిక కార్పోరేటర్ కొలగాని శ్రీనివాస్ బీజేపీ నాయకులతో కలసి పనులను పరిశీలించారు. నిలిచి పోయిన ఆర్వోమి పనులపై కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లానని, అధికారులతో మాట్లాడి పనులు స్పీడప్ అయ్యేలా చొరవ చూపారని తెలిపారు. వీటితో పాటు స్థానికంగా ఉన్న గుంతల రోడ్డుకు మరమ్మతులు ప్రారంభ మయ్యాయన్నారు. ఈ సందర్బంగా కేంద్ర మంత్రి బండి సంజయ్‌కి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు ఒడ్నాల కోటేశ్వర్, కైలాస నవీన్, గాండ్ల నరేష్, వీరన్న, సురేందర్ రెడ్డి, కర్ణాకర్, సత్యనారాయణ, ప్రవీణ్ పాల్గొన్నారు.