కాంగ్రెస్‌లో ఎమ్మెల్సీ వర్సెస్ ఎమ్మెల్యే..
మరోసారి రచ్చకెక్కిన వివాదం..
‘ఇక్కడ ఉండనిస్తారా, వెళ్లగొడతారా’
అధికారుల తీరుపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అసహనం
జగిత్యాల-జనత న్యూస్
జగిత్యాలలో మరోసారి రచ్చకెక్కాయి కాంగ్రెస్ పోలిటిక్స్. పట్టణంలో తాజాగా ప్లెక్సీ వివాదాన్ని రాజేసింది. ఒకే పార్టీలోని ఈ ఇద్దరి నాయకుల మధ్య ఉన్న రాజకీయ వైరాన్ని ఎత్తిచూపేలా చేసింది. జగిత్యాల పట్టణంలోని ఎనిమిదవ వార్డు బేడ బుడగ జంగాల కాలనీలో బోనాల పండుగ సందర్భంగా జీవన్ రెడ్డి ఫోటోతో ఫ్లెక్సీ ఏర్పాటు చేయగా..ఇందులో ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ తో పాటు స్థానిక కాంగ్రెస్ నాయకుల ఫోటోలను ముద్రించారు. అయితే ఆ ఫ్లెక్సీ ని ఏర్పాటు చేసిన గంటల వ్యవధిలోనే మున్సిపల్ సిబ్బంది తొలగించారు. బోనాల కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తిరుగు ప్రయాణంలో ఫ్లెక్సీలను తొలగిస్తున్న మున్సిపల్ సిబ్బందిని ఎందుకు తీసేస్తున్నారని ప్రశ్నించారు. తమను టీపీఎస్ తేజస్విని తొలగించాలని చెప్పడంతోనే తీసేస్తున్నామని తెలిపారు మున్సిపల్ సిబ్బంది. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వెంటనే మున్సిపల్ అధికారులతో మాట్లాడి ఫ్లెక్సీలను ఎలా తొలగిస్తారు అంటూ మండిపడ్డారు. టిపిఎస్ తేజస్విని పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తానన్నారు జీవన్ రెడ్డి. అసలు తనను జగిత్యాల లో ఉండనిస్తారా.. వెళ్లగొడతారా అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుండి ఆ పార్టీలో గ్రూపు రాజకీయాలు మొదలైనట్లుగా ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారానికి ఆజ్యం పోసినట్లు గా ప్లెక్సీ వివాదం సరికొత్త చర్చకు దారి తీసింది.
జగిత్యాలలో మళ్లీ ప్లెక్సీ వార్..
- Advertisment -