కరీంనగర్-జనత న్యూస్
వివాదాల్లో ఎప్పుడూ ముందుండే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి..కొత్త న్యాయ చట్టం కేసు నమోదు లోనూ మొదటిగా నిలిచారు. ఆయనపై కరీంనగర్ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదైంది. భారత్ న్యాయ్ సంహిత యాక్ట్ 221, 226 (2) సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. నిన్న జిల్లా పరిషత్ సమావేశంలో జిల్లా కలెక్టర్ పమేల సత్పతి బయటకు వెళ్లే క్రమంలో బీఆర్‌ఎస్ సభ్యులతో కలసి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అడ్డుకుని బైఠాయించిన విషయం తెలిసిందే. విధులకు ఆటకం కలిగించినందుకు జడ్పీ సీఈవో పోలీస్ స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. బీఎన్‌ఎస్ చట్టం అమలైన రెండో రోజే హుజురాబాద్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు కావడం చర్చనీయాంశమైంది.