- అధిష్టానం లిస్టులో సీతక్క పేరే ఫస్ట్
- ఆదివాసి బిడ్డ కావడంతో ప్రయారిటీ
- కాంగ్రెస్ డెవలప్ కు ఎంతో కష్టపడ్డ సీతక్క
- రేసులో మరో పది మంది ఆశావాహులు
హనుమకొండ, జనతా న్యూస్ : పీసీసీ రేసులో సీతక్క దూసుకుపోతుంది.. కమిట్మెంట్, పార్టీ డెవలప్మెంట్ కు చేస్తున్న సేవ, ప్రజా సేవలో మంచితనం, సీతక్క కంటే ఆ నియోజకవర్గ ప్రజలకు ఓ నమ్మకం.. ఆ నమ్మకమే ఇవాళ.. సీతక్కను అంచలంచెలుగా ఎదగనిస్తూ మంత్రి పదవిని కట్టబెట్టింది. అంతటితో ఆగకుండా సీతక్క ఇవాళ తెలంగాణ రాష్ట్ర పీసీసీ చీప్ గా పని చేసేందుకు అధిష్టానం ఆలోచన చేస్తుండగా ఆ లిస్టులో సీతక్క పేరు మొదటగా వినిపిస్తుంది. పీసీసీ చీఫ్ కోసం పది మంది ఆశావాహులు ఉండగా కాంగ్రెస్ హై కమాండ్ మాత్రం సీతక్కకి పిసిసి పగ్గాలు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆదివాసి మహిళ కావడంతో ఆమెను ఎవరు వ్యతిరేకరించరని అధిష్టానం ఆలోచిస్తూ కేబినెట్ విస్తరణ సమయంలోనే ఈ మార్పు చేసినందుకు సన్నాహాలు చేస్తున్నరట.