వేములవాడ,జనత న్యూస్: జిల్లాలో నిబంధనలను అతిక్రమించిన హోటల్లో,లాడ్జీలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు.శనివారం రాత్రిపూట వేములవాడ పట్టణంలో లాడ్జీలు,హోటల్లలో ఎస్పీ అఖిల్ మహాజన్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ జిల్లాలోని హోటల్స్,లాడ్జీల్లో అసాంఘిక,చట్టవ్యతిరేకమైన కార్యకలపాలకు తావులేకుండా నిర్వహించాలన్నారు. లాడ్జిలలో బసకోసం వచ్చే వారి ఆధార్ కార్డులు, ఇతర ఐడెంటిటీ కార్డులు తప్పకుండ తీసుకోవాలని,లాడ్జిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ఎవరైన కొత్తవారు, అనుమానిత వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమచారమివ్వాలని సూచించారు.
వ్యభిచారం నడిపిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు
తంగాలపల్లి మండల కేంద్రంలో చందా అరుణ(29), చందా నందిత(22) అనే యువతితో తన ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తోందనే సమాచారాం మేరకు ఎస్ఐ తన సిబ్బంతితో తనిఖీలు నిర్వహించగా రాహుల్ యాదవ్ అనే వ్యక్తి పట్టుపడ్డాడు.వీరిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశామని, వ్యభిచారం నిర్వహిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.