- ఎలుకలు,దోమలు,పందికొక్కులు…లకు నిలయంగా కట్టెల మండి
- ఫిర్యాదు చేసినా పట్టించుకోని మున్సిపల్ అధికారులు
- అధికారులు సత్వరం చర్యలు చేపట్టాలని కాలనీవాసుల విజ్ఞప్తి
కరీంనగర్,జనతా న్యూస్: చుట్టూ భవంతుల మద్యలో కట్టెల మండి..ఉండటంతో ఆకాలనీ వాసులు ఇబ్బంది పడుతున్నారు .ఈ విషయమై మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.వివరాలిలా ఉన్నాయి .కరీంనగర్ నడిబొడ్డున ఉన్న ఎలుకలువిద్యానగర్ వార్డు నం 39లో ఉన్న కట్టెల మండితో దోమలు, పందికొక్కులు తమకు సంబందించిన వాహానాలలో చొరబడి వైర్లను కోరకడంతో చెడిపోతున్నాయని,తమ డ్రైనేజ్ వ్యవస్థని దెబ్బతీస్తున్నాయని అక్కడి కాలనీ వాసులు మున్సిపల్ కమీషనర్ కి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇది కరీంనగర్ లోని విధ్యానగర్‌లో నడుస్తోన్న దందా..నామ మాత్రపు అనుమతులతో కొనసాగుతున్నప్పటికి ఫిర్యాదు చేసిన పట్టించుకోని మున్సిపల్ అధికారులు.కట్టెల మండి వ్యాపారం యధేచ్చగా సాగుతోంది.అయితే ఈ వ్యాపారానికి కనీస నింబధనలేమైన పాటిస్తున్నారో అధికారులే తెలుపాలి.కాని అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తిచూడకపోవడంతో కట్టెల మండి దందాకు అధికారులు వత్తాసు పలకుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ వైపు ప్రభుత్వం హరితాహారం పేరుతో చెట్లను నరకడాన్ని నిషేధించినా ఇక్కడ మాత్రం కట్టెల మండి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. ఈ వ్యాపారులు ఇష్టారాజ్యంగా చెట్లను కొడుతున్నారనే ఉద్దేశ్యంతో ప్రభుత్వము చెట్టుకు 500 రూపాయలు ఆన్లైన్లో ఫీజు చెల్లించి స్థానిక అటవీశాఖ అధికారుల పర్మిషన్ తీసుకొని ట్రాన్స్ పోర్ట్ చేయాలని నిబంధనలు పెట్టింది. అలా కాకుండా కొందరు కట్టెల మండి వ్యాపారులు ఒక చెట్టుకు లేదా రెండు, మూడు చెట్లకు ఆన్లైన్లో ఫీజు చెల్లించి ఎక్కువ చెట్లు కోవడం పరిపాటిగా మారింది. ఎక్కడ చెట్లు అక్కడికి వెళ్ళి ఆయా భూమి యజమానులకు ఎంతో కొంత ముట్టు జెప్పి యధేచ్చగా చెట్లను నరుకుతూ పర్యావరణ పరిరక్షణకు విఘాతం కలిగిస్తూ వ్యాపారం కొనసాగిస్తున్నారు. తమ వ్యాపారం భాగుంటే చాలు ఎవరికి ఇబ్బందైతే మాకేందీ అనే దోరణిలో ఈ వ్యాపారం కొనసాగిస్తుండటం అవి జనావాసాల మధ్య ఉండటంతో చుట్టుపక్కల ఉండే వారికి అనేక ఇబ్బందులు కలుగుతున్నాయి. కరీంనగర్లో దాదాపు వంద వరకు ఇలాంటి వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. కొందరు చిన్న చితకా వ్యాపారం చేస్తుంటారు. మరి కొందరైతే ఇదో వ్యాపారంగా మలుచుకొని ఇష్టం వచ్చినట్టు చెట్లను నరుకుతున్నారు. వాస్తవంలోకి వేళ్తే విద్యానగర్లో ఉండే కట్టెల మండే ఇందుకు నిదర్శనం.ఇక్కడి కట్టెల మండి వ్యాపారులు ఎలాంటి నిబంధనలను పాటిస్తున్నారో తెలియదు గాని ఎక్కువ మొత్తంలో చెట్లను కొట్టుకొచ్చి ఎక్కువ నిలువ పెట్టడంతో నే పంది కొక్కులు, ఎలుకలు తయారవడంతో చుట్టు ప్రక్కల ఇండ్లవారికి ఇబ్బందిగా మారుతుందని పందికొక్కులు నిత్యం ఇండ్లలోకి దూరి తమకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయని, రాబోయే వర్షాకాలంలో వీటి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తక్షణమే స్పందించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు.
ఫిర్యాదు చేసినా కనీస స్పందన కరువు : కాలనీ వాసులు
జనావాసాల మధ్య యధేచ్చగా నిర్వహిస్తున్న కట్టెలమండీ ద్వార ఏర్పడుతున్న సమస్యలను పలుమార్లు మున్సిపల్ అధికారులకు పిర్యాదులు చేసినా అటువైపు కన్నెత్తి చూడడంలేదని వాపోతున్నారు.ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న పాపాన పోలేదని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కట్టెల మండీ వ్యాపారులతో మున్సిపల్ అధికారులు లాలూచీ పడడం వల్లే తమ ఫిర్యాదులను పట్టించుకోవడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంతో తమకు ప్రమాదం పొంచి ఉందని, ఇప్పటికైనా అధికారులు సత్వరం స్పందించి తమకు న్యాయం చేసేల చర్యలు చేపట్టాలని కాలనీ వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.