Friday, September 12, 2025

నేటి సాయంత్రం నుండి మద్యం దుకాణాలు బంద్‌

వరంగల్,జనతా న్యూస్: ఉమ్మడి వరంగల్-నల్లగొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ కి ఈనెల 27వ తేదీన ఎన్నికలు నిర్వహిస్తున్న వేళ వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో (వరంగల్, హనుమకొండ, జనగామ ) ప్రశాంతమంతమైన వాతావరణంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను నిర్వహించేందుకు వరంగల్ పోలీస్ కమిషనర్ తీసుకుంటున్న చర్యల్లో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 48 గంటల పాటు మద్యం దుకాణాలు మూసివేయాల్సిందిగా వరంగల్ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఉత్తర్వులమేరకు నేటి సాయంత్రం 4గంటల నుంచి 27 వ తేది సాయంత్రం 4గంటల వరకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మద్యం దుకాణాలు మూసి వేయాల్సిందిగా ఉత్తర్వుల్లో తెలిపారు . ఎవరైనా ఉత్తర్వులను అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని పోలీస్ కమిషనర్ తెలిపారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page