- పోలీసు వాహనం ధ్వంసం
- హనుమాన్ భక్తుల అరెస్టు
- త్రీటౌన్ పీఎస్ ఎదుట బీజేపీ నిరసన
- పోలీసుల లాఠీచార్జ్.. పలువురికి గాయాలు
కరీంనగర్,జనతా న్యూస్ : కరీంనగర్లో శనివారం రాత్రి నిర్వహించిన హనుమాన్ శోభాయాత్రలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలోని సివిల్ ఆస్పత్రి ఎదు రుగా ఉన్న ప్రశాంత్ నగర్ హనుమాన్ దేవాలయం నుంచి గాంధీ రోడ్లోని హనుమాన్ దేవాలయం వరకు హనుమాన్ శోభయాత్ర ప్రారంభించారు. హనుమాన్ మాలధారులు ర్యాలీ నిర్వహిస్తుండగా కొందరు గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి ర్యాలీని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో హనుమాన్ మాలాధారులు ఆందోళన చేపట్టారు. సమ చారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపు చేశారు. ఇంతలో ఓ వ్యక్తి శోభ యాత్రలో ఓ వ్యక్తి కత్తి పట్టుకుని తిప్పడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం సోషల్ మీడియా ద్వారా ప్రచారం కావడంతో చాలా మంది ఇక్క డికి వచ్చారు. ఈ క్రమంలో పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేం దుకు కొందరిని అరెస్ట్ చేశారు. అయితే అదుపులోకి తీసుకున్న హనుమాన్ భక్తులను విడుదల చేయాలని మిగతా వారు ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనలో భాగంగా పోలీస్ అద్దాలను ధ్వంసం అయ్యాయి. అనంతరం బీజేపీ నాయకులు త్రీ టౌన్ ఎదుట బైఠా యించారు. అదుపులోకి తీసుకున్న హనుమాన్ భక్తులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ఉద్రిక్తత వాతవరణం నెలకొంది.
కత్తి తిప్పిన వ్యక్తి జయదేవ్
హనుమాన్ శోభయాత్రలో భాగంగా ఓ వ్యక్తి కత్తి పట్టుకొని హల్ చల్ చేశాడు. ఈయన బిజెపి నాయకుడు బాస సత్యనారాయణ అనుచరుడు అని పోలీసులు తెలుపుతున్నారు. ఆ వ్యక్తి ద్వారానే ఆందోళన చోటు చేసుకుందని అంటున్నారు.
పోలీసుల తీరుపై బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం
హనుమాన్ భక్తుల ర్యాలీ వెళుతుండగా గుర్తు తెలియని వ్యక్తులు ర్యాలీని అడ్డుకోనే విదంగా ప్రవర్తిస్తే వారిపై చర్యలు తీసుకొకుండా హనుమాన్ భక్తులపై దురుసుగా ప్రవర్తించారని కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. ఈ మేరకు ఆయన డిజీపితో నేరుగా ఫోన్ లో మాట్లాడారు. భక్తులపై దురుసుగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కిందిస్థాయి అధికారులు చెప్పే అబద్దాలకు అనుగుణంగా వ్యవహరించొద్దని సూచించారు.తాము పోలీసు వ్యవస్థకు వ్యతిరేకం కాదని.. తప్పుడు సమాచారంతో సమస్యను జఠిలం చేసే పోలీసులకే తాము వ్యతిరేకమని స్పష్టం చాశారు.వాస్తవాలను తెలుసుకుని సమస్యను పరిష్కరించాలని సంజయ్ డీజీపీని కోరారు.కరీంనగర్ లో జరిగిన ఆందోళన నేప థ్యంలో బండి సంజయ్ హైదరాబాద్ నుండి హుటాహుటిన కరీంనగర్ కు బయలుదేరారు.