సిద్దిపేట,జనత న్యూస్: వరంగల్,ఖమ్మం,నల్గొండ,పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక దృష్ట్యా జిల్లాలోని చేర్యాల,కొమరవెల్లి, మద్దూర్,దూల్మిట్ట మండలాల పరిధిలో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్టు సీపీ అనురాధ శుక్రవారం తెలిపారు.జిల్లా పరిధిలో నాలుగు మండలాలలో పోలింగ్ కేంద్రాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంతమైన వాతావరణంలో,పారదర్శకంగా,నిష్పక్షపాతంగా సజావుగా ఎన్నికలు నిర్వహించేందుకు నేటీ నుండి 28 వరకు 144 సీఆర్.పీసీ సెక్షన్ అమలు చేస్తున్నట్లు సీపీ తెలిపారు.
ఆ నాలుగు మండలాల్లో 144 సెక్షన్ అమలు
- Advertisment -