హైదరాబాద్, జనత న్యూస్: ఈ ఏడాది చేప ప్రసాదం పంపిణీ పై బత్తినీ కుటుంబ సభ్యులు ఇప్పటికే కీలక ప్రకటన చేశారు. జూన్ 8న శనివారం 11 గంటలకు మృగశిర కార్తి ప్రవేశిస్తుందని ఆ రోజున చేప ప్రసాదం పంపిణీ చేస్తామని బత్తిని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ మేరకు జూన్ 8న ఉదయం 11 గంటలకు నుంచి జూన్ 90 ఉదయం 11 గంటల వరకు చేప పంపిణీ ఉంటుందన్నారు. ఈ మేరకు చేప ప్రసాదం కోసం వచ్చే వారి కోసం ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. అస్తామా, ఉబ్బసం, దగ్గు వంటి శ్వాస సంబంధిత వ్యాధుల నివారణకు ఏటా దీన్ని పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు.
చేప ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు
- Advertisment -