సిద్దిపేట,జనత న్యూస్: సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీస్ అధికారులు,మద్దూర్ పోలీసులు మద్దూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జాలపల్లి గ్రామ శివారులో అక్రమ ఇసుక నిల్వలపై నమ్మదగిన సమాచారం మేరకు మంగళవారం దాడి చేశారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు నిల్వ చేసిన సుమారు 150 టన్నుల అక్రమ ఇసుకను సీజ్ చేశామని అధికారులు తెలిపారు.మద్దూర్ పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటారని టాస్క్ ఫోర్స్ అధికారులు తెలిపారు.
అక్రమ ఇసుక నిల్వలపై టాస్క్ ఫోర్స్ దాడి
- Advertisment -