హైదరాబాద్, జనత న్యూస్: హైదరాబాద్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో సిద్ధిపేట జిల్లా బెజ్జంకి మండలం కోటపల్లి గ్రామానికి చెందిన అజయ్ మృతి చెందాడు. హైదరాబాద్ లోని దోమలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాణిగంజ్ నుంచి ట్యాంక్ బండ్ మీదుగా వెళ్తున్న సమయంలో తన బైక్ ను ఓ వాహనం ఢీకొట్టింది. దీంతో అజయ్ అక్కడికక్కడే మృతి చెందాడు. అజయ్ బోయిన్ పల్లిలోని అంజయ్యనగర్ లో నివాసం ఉంటూ శ్రీకర ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్నాడు.
హైదరాబాద్ రోడ్డు ప్రమాదంలో బెజ్జంకి వాసి మృతి
- Advertisment -