- స్కిన్ లెస్ రూ 290
- విత్ స్కిన్ రూ 260
- వర్షాలు, ఉత్పత్తి కొరత
హనుమకొండ, జనతా న్యూస్ : చికెన్ ధరలకు రెక్కలోచ్చాయి.. గత వారం కిలో చికెన్ 250-260 రూపాయల ధర పలుకగా ఇవాళ బహిరంగ మార్కెట్లో స్కిన్లెస్ కిలో 280-290 రూపాయలకు, విత్ స్కిన్ 250-260 రూపాయల ధర పలికింది. కిలోకు ఒకే రోజు 20-30 రూపాయల పెరుగుదల కనిపించడంతో కొనుగోలుదారులు చికెన్ కొనాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. వర్షాలు పడడం, డిమాండ్ కు తగ్గ ఉత్పత్తి లేకపోవడమే ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారాలు తెలుపుతున్నారు. ధరలు ఇంకొన్ని రోజుల పాటు ఇలానే కొనసాగుతాయని తర్వాత ఉత్పత్తి పెరిగాక ధరలు క్రమక్రమంగా తగుముఖం పడతాయని తెలుపుతున్నారు.