న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ బీజేపీ కార్యాలయం వద్ద పోలీసులు 144 సెక్షన్ విధించారు. బెయిల్ పై బయటకు వచ్చిన వచ్చిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆధ్వర్యంలో నగరంలోని డీడీయూ మార్గ్ లో ఉన్న బీజేపీ కార్యాలయం ముట్టడికి బయలు దేరారు. అంతకుముందు మీడియా సమావేశం నిర్వహించిన కేజ్రీవాల్ మాట్లాడారు. ఆమ్ ఆద్మీ పార్టీ అగ్ర నేతలను అరెస్టు చేయడానికి బిజెపి ఆపరేషన్ ఝూఝూ ఆపరేషన్ ప్రారంభించింది అని అన్నారు. ఆప్ బ్యాంక్ అకౌంట్లను కూడా త్వరలో ఫ్రీజ్ చేస్తారని చెప్పుకొచ్చారు. అయితే బిజెపి హెడ్ ఆఫీస్ ముందు నిరసన తెలపడానికి ఆప్ ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో బిజెపి ఆఫీసు వద్ద 144 సెక్షన్ విధించారు. డీడీయూ మార్క్ లోని బిజెపి కార్యాలయం వద్ద భారీ కేడ్లను ఏర్పాటు చేశారు.
బీజేపీ కార్యాలయం వద్ద 144 సెక్షన్
- Advertisment -