Thursday, July 3, 2025

ఈతకు వెళ్లి ఇద్దరి మృతి.. ఒకరు గల్లంతు..

విజయవాడ: ఆంధ్రప్రదేశ్లో ఈతకు వెళ్లిన ఇద్దరు యువకులు నదిలో మునిగి మరణించారు. మరో వ్యక్తి గల్లంతు కావడంతో ఆయన కోసం గాలిస్తున్నారు.  కోనసీమ జిల్లాలోని  కొత్తపేట నియోజకవర్గం రావులపాలానికి చెందిన ఈశ్వర్ రెడ్డి, సంపత్ రెడ్డి, జయకుమార్ తో పాటు వెళ్లిన రాజేష్ ఈతరాక గట్టుమీద ఉండిపోయాడు. అయితే నది లోకి వెళ్లిన ముగ్గురు ఎంతసేపటికి రాకపోవడంతో రాజేష్ పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గజ ఈతగాళ్ల సహాయంతో మృతదేహం కోసం గాలించారు. వీరిలో ఇద్దరు మృతదేహాలు లభ్యమయ్యాయి.   మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తామని వెల్లడించారు. ఈతకు వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page