హైదరాబాద్, జనత న్యూస్: లంగాణలో మరో మూడు రోజులు వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఆదివారం కొన్ని జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు ఉంటాయన్నరు. ఇవి గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తాయని తెలిపారు. నైరుతి రుతుపవనాలు మాల్తీవుల్లో కొంతవరకు, కోమరిన్ ప్రాంతంలో మరికొంత మేర, దక్షిణ అండమాన్ సముద్రంలో కొన్ని ప్రాంతాల నుంచి విస్తరించాయని తెలిపారు. దీంతో దక్షిణ ఛత్తీస్ గఢ్, తెలంగాణ, రాయలసీమ మీదుగా దక్షిణ కర్ణాక వరకు వర్షాలు ఉంటాయన్నారు. సముంద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఆవర్తనం బలహీనపడిందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది.
Weather Report: మరో మూడు రోజులు భారీ వర్షాలు..
- Advertisment -