- దుబ్బాకలో 40,సిద్దిపేటలో 140 క్వింటాళ్లు
సిద్దిపేట,జనత న్యూస్: ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా ప్రభుత్వ రేషన్ బియ్యం తరలిస్తున్నారని నమ్మదగిన సమాచారం మేరకు సిద్దిపేట టాస్క్ ఫోర్స్,దుబ్బాక,సిద్దిపేట త్రీ టౌన్ పోలీస్ అధికారులు,సిబ్బంది సంయుక్తంగా దాడి చేసి సుమారు 180 క్వింటాళ్ల రేషన్ బియ్యం శనివారం పట్టుకున్నామని అధికారులు తెలిపారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్ద చీకోడ్ గ్రామంలో గురుపాదం తన ఇంటిలో సుమారు 40 క్వింటాళ్ల రేషన్ బియ్యం అక్రమంగా నిల్వ చేశాడు.విశ్వసనీయ సమాచారం మేరకు దాడి పట్టుకున్నామని అధికారులు తెలిపారు.దుబ్బాక పోలీసులు కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంభించారు.
సిద్దిపేట త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ రహదారిపై హుజురాబాద్ మండలం,శాలపల్లి గ్రామానికి చెందిన గద్దల రవివర్మ,నాగరాజు,తిరుపతి, శ్రీను మరో ఇద్దరు కలిసి డీసీఎం వాహనంలో వరంగల్,సిద్దిపేట మీదుగా హైదరాబాద్ ప్రాంతానికి అక్రమంగా సుమారు 140 క్వింటాళ్ల రేషన్ బియ్యం తరలిస్తున్నారనే సమాచారం మేరకు దాడి అధికారులు పట్టుకున్నామని తెలిపారు.త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంభించారు.