Saturday, July 5, 2025

‘దోస్త్’ సహాయక కేంద్రం ఏర్పాటు

జగిత్యాల,జనత న్యూస్: తెలంగాణ రాష్ట్రంలోని ఇంటర్మీడియట్, తత్సమాన పరీక్షలు పాసైన విద్యార్ధినీ, విద్యార్థులందరూ డిగ్రీలో ప్రవేశాల కొరకై దోస్త్ (డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ) దరఖాస్తు చేసుకోవాలని, రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయని స్థానిక ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్, జిల్లా దోస్త్ అడ్మిషన్ల కో ఆర్డినేటర్ డాక్టర్ అరిగెల అశోక్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జగిత్యాల జిల్లాలోని విద్యార్థులందరూ ఈ సహాయక కేంద్ర వసతిని వినియోగించుకొని, ఎలాంటి సాంకేతిక సమస్యలు గానీ, ఇతర సమస్యలు గానీ తలెత్తినట్లైతే 98484 15835(ప్రిన్సిపాల్), 98855 88419(అకాడమిక్ కో ఆర్డినేటర్, ఎన్ సందీప్), 99632 87177(టెక్నికల్ అసిస్టెంట్, గణేష్ )లను సంప్రదించగలరని పేర్కొన్నారు. మొదటి విడత వెబ్ ఆప్షన్లు మే 20 నుండి ప్రారంభమవుతాయని, మొదటి విడత సీట్ల కేటాయింపు వివిధ కళాశాలలకు జూన్ 6న ఉంటుందని,రెండవ విడత సీట్ల కేటాయింపు జూన్ 6 నుండి, మూడవ విడత జూన్ 19 నుండి ఉంటాయని, జూలై 8వ తేదీ నుండి మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.విద్యార్థులందరూ ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని ఆయన పేర్కొన్నారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page