హైదరాబాద్, జనతా న్యూస్: ఓ పెంపుడు కుక్క రెండు కుటుంబాల మధ్య వివాదాన్ని తీసుకొచ్చింది. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. కుక్కకు కూడా బలంగా దెబ్బలు తగిలాయి. హైదరాబాదులోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలీసుల కథనం ప్రకారం రహ్మత్ నగర్ నివాసి మధు కుటుంబం హస్కీ జాతికి చెందిన కుక్కను పెంచుకుంటున్నాడు. ఈ నెల 8న పోస్టల్ బ్యాలెట్ ఓటు వేసేందుకు మధు కుటుంబ సభ్యులు ఇంటి నుంచి బయలుదేరారు. ఆ సమయంలో పెంపుడు కుక్క కూడా వీరితో పాటు బయటకు వచ్చి నిర్మాణంలో ఉన్న ఎదురింటి ధనుంజయ్ ఇంటి ఆవరణలోకి వెళ్ళింది. కుక్కను తమపై ఉసిగొల్పారంటూ ధనుంజయ్ కుటుంబ సభ్యులు గొడవకు దిగారు. ఈ గొడవపై రెండు కుటుంబాలు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనతో కోపం పెంచుకున్న ధనుంజయ్ ఆగ్రహంతో రగిలిపోయాడు. మరో రోజు మధు కుుటుంబ సభ్యుల్లో ఒకరైన శ్రీనాథ్ పెంపుడు కుక్కతో వాకింగ్ బయలుదేరాడు. ఇది చూసిన ధనుంజయ్ మరో నలుగురితో వచ్చి ఇంటి గేటు వద్ద ఉన్న కుక్కను ఇనుపరాలతో విచక్షణ కొట్టాడు. ప్రాణంగా చూసుకునే కుక్కను ధనుంజయ్ కొడుతుంటే శ్రీనాథ్, అతని కుటుంబ సభ్యులు కుక్కను కాపాడే ప్రయత్నం తో దాడి చేశారు. ఈ దారిలో మధు సోదరుడు శ్రీనాథ్ తో పాటు అతని తల్లి రాజేశ్వరి, అతని మరదలు స్వప్నలు తీవ్రంగా గాయపరిచారు. దెబ్బలతో కుక్కతో పాటు కుటుంబ సభ్యుల పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
కుటుంబాల మధ్య చిచ్చుపెట్టిన పెంపుడు కుక్క.. పలువురికి తీవ్ర గాయాలు
- Advertisment -