Friday, September 12, 2025

ఉచిత విద్యుత్ పై తొలి సంతకం..

భువనేశ్వర్: ఒడిశాలో బీజేడీ పార్టీ అధికారంలోకి రాగానే ఉచిత విద్యుత్ పథకం అమలు చేస్తామని ప్రకటించింది. నవీన్ పట్నాయక్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయగానే ఈ పథకంపై తొలి ఉత్తర్వులు జారీ చేస్తామని ఆ పార్టీ నాయకుడు వీకే పాండ్యన్ పేర్కొన్నారు.   జూన్ 9వ తేదీన పూరి జగన్నాథ స్వామి, ప్రజల ఆశీస్సులతో నవీన్ పట్నాయక్ ఆరోసారి  ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని అన్నారు. ఈ ఉచిత విద్యుత్ పథకంతో  90 శాతం మంది ప్రజలకు లబ్ధి చేకూరనుందని అన్కూనారు.  దేవగఢ్ జిల్లాలో సీఎం నవీన్ పట్నాయక్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విషయాలు వివరించారు. దీని ప్రకారం రాష్ట్రంలో అన్ని గృహాలకు 100 యూనిట్లు వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని స్పష్టం చేశారు.  అలాగే 150 యూనిట్ల విద్యుత్ వాడకం ఉంటే అందులో 50 యూనిట్లు ఉచితమని తెలిపారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page