కరీంనగర్,జనత న్యూస్: ఈవీఎంలను భద్రపరిచిన గదుల వద్ద సిబ్బంది అలర్ట్ గా ఉండాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను అదేశించారు.బుధవారం కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజ్ లో భద్రపరిచిన ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఈవీఎంల భద్రత గదుల వద్ద పోలీస్ భద్రతను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతితో కలిసి పరిశీలించారు.వేరువేరుగా భద్రపరిచిన అన్ని స్ట్రాంగ్ రూములను పర్యవేక్షించి భద్రతపై సమీక్షించారు. సీసీ కెమెరాల పనితీరు, పోలీస్ సిబ్బంది విధుల నిర్వహణ అదనంగా చేపట్టాల్సిన భద్రత అంశాలపై జిల్లా కలెక్టర్, సీపీ చర్చించారు. ఈ మేరకు అధికారులకు దిశా నిర్దేశం చేశారు.కాలేజ్ చుట్టు ప్రక్కల పర్యవేక్షించారు.ఉదయం,సాయంత్రం వేళల్లో వాకర్సు,ఇతర వ్యక్తులు కాలేజీలోకి ప్రవేశించకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. కౌంటింగ్ పూర్తయ్యే వరకు భద్రత సిబ్బంది, అధికారులు అలర్ట్ గా ఉండాలని కలెక్టర్,సీపీ సిబ్బందికి సూచించారు. రాత్రి వేళల్లో జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఆర్డీవో కే మహేశ్వర్, టౌన్ ఏసీపీ నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
భద్రత సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి..
- Advertisment -