ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని మే 20 వరకు పొడిగించినట్లు రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు తెలిపింది. ఈడి కేసులో రిమాండ్ లో ఉన్న కవితను మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తీహాడ్ జైలు నుంచి హాజరు పరిచారు. లిక్కర్ కేసు దర్యాప్తు కొనసాగుతున్నందున రిమాండ్ అవసరమని ఈడీ అధికారులు కోర్టును కోరారు. ఈడి తరఫున న్యాయవాది వాదనతో ఏకీభవించిన కోర్టు కస్టడీని ఈ నెల 20 వరకు పొడిగించారు.కవితపై 8 వేల పేజీల సప్లమెంటరీ చార్జీ షీట్ ను ఈడి అధికారులు కోర్టుకు సమర్పించారు. ఇరుపక్షాల వాదనలు విన్నకోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే కవిత ను ఈసారి ఈడి అధికారులు నేరుగా కోర్టుకు తీసుకురాకుండా వర్చువల్ గా విచారణ జరిపించారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బెయిల్ మంజూరు చేయాలని కవిత ఇప్పటికే దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. తాను తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ స్టార్ క్యాంపెయిన్ లలో ఒకరని, దీనిని పరిగణలోకి తీసుకొని కవితకు బెయిల్ ఇవ్వాలని కవిత తరఫున న్యాయవాది కోరారు. కానీ కవితకు బయట ఉంటే సాక్ష్యులను ప్రభావితం చేస్తారని, ఈ కేసులో ఆమె కీలకపాత్ర అని ఈడి అధికారులు కోర్టుకు తెలిపారు