వరంగల్ ,జనతా న్యూస్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం జరిగిన లోకసభ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టి మొత్తానికి ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించారు. మొదటగా మందకొడిగా ప్రారంభమైన ఎన్నికల విధానం సాయంత్రం వరకు బాగానే పుంజుకుంది. అయితే గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాలలో పోలింగ్ శాతం తప్పుగానే నమోదయినట్లు చెప్పవచ్చు. పోలింగ్ విధానం ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఓటు వినియోగించుకునే అవకాశం ఉంది. అయితే కొన్ని సమస్యత్మకమైన ప్రాంతాలలో నాలుగు గంటలకు, ఐదు గంటల వరకు మిగతా ప్రశాంత ప్రాంతాలలో ఆరు గంటల వరకు తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. అయితే రాష్ట్రంలో ఓటు వినియోగానికి ఓటర్లు ఎక్కువ శాతం గ్రామీణ ప్రాంతాలలోని తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది.
పట్టణ ప్రాంతాలలో ఏడు గంటలకే ప్రారంభమైన ఓటు చేసే విధానం కానీ 10 గంటల వరకు ఓటర్లు ఎక్కువ శాతం నగరాలలో తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి రాలేదు. సోమవారం జరిగిన 18వ లోకసభ ఎన్నికలు రాష్ట్రంలో ప్రశాంత వాతావరణంలో నిర్వహించబడినప్పటికీ ఓటు వినియోగశాతాన్ని అర్బన్ ప్రాంతాలలో పెంచలేకపోతున్నారు. వరంగల్ హనుమకొండ ప్రాంతాలలో ఓటింగ్ శాతం పెంచుటకు ఓటర్లను చైతన్యవంతులు చేయుటకు జిల్లా కలెక్టర్లు గత నెల రోజులుగా రోజు సదస్సులు, ర్యాలీలు, పరుగు పందాలను నిర్వహించినప్పటికీ వరంగల్ హనుమకొండ జిల్లాల పరిధిలోని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఓటర్లు ఎక్కువగా ఓటు వినియోగానికి ఆసక్తి చూపలేదని చెప్పాలి. కొన్ని ప్రాంతాలలో పోలీసులు అనేక ఆంక్షలు పెట్టి ఇబ్బందులు పెట్టినారు. గ్రామీణ ప్రాంతాలను, అర్బన్ ప్రాంతాలను పరిశీలించినట్లయితే అర్బన్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూతులు ఎక్కువగా ఉన్నాయి. కానీ గ్రామీణ ప్రాంతాలలో పోలింగ్ బూతులు ఒకటి రెండు మాత్రమే ఉండడం వల్ల, పోలింగ్ బూతు వద్ద పెద్ద క్యూ లైన్ ఉండడంవల్ల చాలామంది ఓటర్లు తర్వాత వచ్చి ఓటు వేద్దాం అని తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వెనుకడుగు వేసి మరిచిపోతున్నారు.
అయితే గతంలో ఇటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ దీని నుండి పాఠాలు నేర్చుకోని అధికారులు మళ్లీ పాత పద్ధతిలోనే గ్రామీణ ప్రాంతాలలో ఒకటి రెండు బూతులు మాత్రమే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఎండ తీవ్రత కారణంగా దృష్ట్యా ఉదయం ఏడు గంటలకే గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఉన్న ఒకటి రెండు బూతులలో పెద్ద క్యూ లైన్ కనబడుతుంది. దీన్ని చూసి చాలామంది ఓటర్లు లోపటికి రాకుండానే వెనదురుగుతున్నారు. పోలింగ్ బూత్లను పెంచాలని గతంలో అనేక సూచనలు వచ్చినప్పటికీ అధికారులు మాత్రం పాత పద్ధతిలోనే ఒకటి రెండు బూతులు ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారని విమర్శలు వినబడుతున్నాయి. అంతేకాకుండా పోలీసులు మెయిన్ గేటు వద్దనే సెల్ ఫోన్లు లోపటికి అనుమతించడం లేదని చెప్పడంతో అక్కడ సెల్ ఫోన్ ఎవరికి ఇవ్వాలని ఆలోచించి, తమ వారు సెల్ఫోన్ పట్టుకోడానికి ఎవరూ లేకపోవడంతో చాలామంది ఓటు వెయ్యకుండానే వెని తిరుగుతున్నారు. ఇటువంటి సంఘటనలు జరుగుతున్న, అధికారులు మాత్రం పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై కట్టుదిట్టమైన చర్య లేకపోవడం ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి.
వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఎక్కువమంది పోటీ చేయడంతో తో ఓటింగ్ మిషన్లను ఒక్కొక్క పోలింగ్ బూతులు లో మూడు ఏర్పాటు చేయడం వల్ల సామాన్య మానవులకు ఓటు ఎక్కడ ఇయాల గుర్తులు సరిగా తెలవక ఏదో ఒక గుర్తు మీద ఒత్తి బయటికి వస్తున్నారు. ఓటర్లను ఆకర్షించుకునే విధంగా గత నెల రోజులుగా వివిధ రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున క్రమ ప్రచార కార్యక్రమాన్ని కొనసాగించిన విషయం తెలిసిందే. కానీ ఓటింగ్ శాతం గ్రామీణ ప్రాంతాల లోనే ఎక్కువ శాతం ఉండడం, పట్టణ ప్రాంతాలలో తక్కువగా ఉండటం గమనించదగ్గ విషయం.