Wednesday, July 2, 2025

హైదరాబాద్ కు తిరుగు పయనం..

విజయవాడ, జనత న్యూస్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో ఓటేసేందుకు హైదరాబాద్ నుంచి తరలిన ఏపీ వాసులు తిరిగి సొంతగూటికి చేరుకుంటున్నారు. కార్లు, బస్సులు ఏ వాహనం దొరికినా సొంత ఊరికి వచ్చేందుకు దారిమళ్లారు. హైదరాబాద్ కు వచ్చే వాహనాలు మరోసారి రద్దీ కావడంతో రహదారులన్నీ కిక్కిరిసిపోయాయి. సోమవారం సాయంత్రం ఐదు గంటల నుంచి తిరుగుబాటు పట్టడంతో రోడ్లపై రద్దీ పెరిగింది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా చిలకల్ల టోల్ ప్లాజా  వద్ద సాధారణంగా 24 గంటలు 20వేలకు పైగా వాహనాలు హైదరాబాదు వైపు వెళ్తుంటాయి. కానీ సోమవారం సాయంత్రం 6:30 గంటలకు 35 వేలకు పైగా వాహనాలు చేరాయి. మంగళవారం ఉదయం వరకు మరింత పెరిగింది. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కు సుమారు 6 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చినట్లు తెలుస్తోంది. ఏపీకి తెలంగాణ నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా వచ్చి ఓటు వినియోగించుకున్నారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page