ఉత్తరాఖండ్: పరమేశ్వరుడు కొలువైన పవిత్ర బద్రినాథ్ ఆలయం తలుపులు ఆదివారం తెరుచుకున్నాయి. 12 జ్యోతిర్లింగాలలో బద్రీనాథ్ ఆలయం ఒకటి. చార్ధామ్ యాత్ర శుక్రవారం నుంచే ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి, ఆలయాలు భక్తుల కోసం శుక్రవారం రోజు తెరుచుకున్నాయి. వేసవిలో మాత్రమే ఈ ఆలయాలు తెరుచుకుంటాయి. వర్షాకాలం, శీతాకాలంలో మంచు కురుస్తూ ఉంటుంది. కావున ఆ టైంలో గుడిని మూసివేసి ఉంచుతారు. వేద పండితుల మంత్రోచ్ఛారణ మధ్య ఆదివారం ఉదయం 6 గంటలకు ఆలయ ప్రధాన తలుపులను అధికారులు తెరిచారు. ఇండియన్ ఆర్మీ గ్రానైట్ డియర్ రెజిమెంట్ బ్యాండ్ భజన గీతాలను పాడారు. ప్రత్యేక పూలతో ఆలయాన్ని సుందరంగా అలంకరించారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
తెరుచుకున్న బద్రీనాథ్ ఆలయం
- Advertisment -