Ap Assembly Elections 2024: ఎన్నికలవేళ తెలుగు రాష్ట్రాల్లో భారీగా నగదు పట్టుబడుతోంది. అక్రమంగా తరలిస్తున్న డబ్బులను పట్టుకోవడానికి చెక్ పోస్టులు, నగర శివారుల్యంలో పోలీసులు తనిఖీలు చేస్తున్నా.. కొందరు వివిధ మార్గాల్లో డబ్బులు తరలిస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లాలో తవుడు బస్తాల మధ్యలో నగదు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని నల్లజర్ల మండలం అనంతపల్లి ఎర్రకాలువ వద్ద ఓ లారీని టాటా ఏస్ వాహనం ఢీకొట్బోటింది. విశాఖ నుంచి విజయవాడ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. వెంటనే ఘటన స్థలానికి వచ్చిన కానిస్టేబుల్ సాయికుమార్ వాహనంలో భారీగా నగదు ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆయన ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. తవుడు బస్తాల మధ్యలో కొన్ని బాక్సుల్లో ఈ నగదు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీటిని లెక్కించగా రూ. 7 కోట్లు ఉన్నట్లు తెలిపారు.
Ap Assembly Elections 2024: తవుడు బస్తాల మధ్యలో రూ.7 కోట్లు
- Advertisment -