ఢిల్లీ: లిక్కర్ కేసులో అరెస్ట్ అయి తిహాడ్ జైలులో ఉన్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీ వాల్ కు మధ్యంతర బెయిల్ లభించింది. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ప్రచార నిమిత్తం జూన్ 1 వరకు ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది .మద్యం కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై మార్చి 21న ఈడీ అధికారులు కేజ్రీవాల్ ను అరెస్టు చేశారు. అంతకు ముందు ఈ కేసులో విచారణకు రావాలంలూ ఈడీ 9 సార్లు నోటీసులు జారీ చేసింది. అయినా వాటికి స్పందించకపోవడంతో ఈడి 21న అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం కేజ్రీవాల్ తీహాడ్ జైల్లో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. తన అరెస్టును సవాలు చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్
- Advertisment -