Sunday, September 14, 2025

150 హామీలిచ్చి ఒక్కటీ చేయలేదు:కరీంనగర్‌ లో కేసీఆర్‌

కరీంనగర్‌, జనత న్యూస్‌: 150 హామీలిచ్చిన ప్రధాని మోదీ ఒక్కటి కూడా చేయలేదని మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కే. చంద్రశేఖర్‌ రావు విమర్శించారు. లోక్‌ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఆయన కరీంనగర్‌ లో ఇక్కడి అభ్యర్థి వినోద్‌ కుమార్‌ తరుపున ప్రచారం చేశారు ఈ సందర్బంగా మాట్లాడుతూ అచ్చేదిన్‌ అని చెప్పి ధరలు పెంచడం తప్ప అచ్చేధిన్‌ రాలేదన్నారు. వికసిత భారత్‌ కాలేదు కానీ ..విఫల భారత్‌ అయ్యిందని విమర్శించారు. నల్లధనం తెచ్చి ఇస్తా అన్నాడు..ఎడ పోయింది..బండి సంజయ్‌ తెచ్చి ఇచ్చాడా..? అని ప్రశ్నించాడు. పుల్వమా…పాకిస్థాన్‌ పేరు చెప్పి ఎమోషనల్‌ బ్లాక్‌ మెయిల్‌ చేసి పదేళ్లు పూర్తి చేసుకున్నారని, మేధావులు ఆలోచించి ఓటేయ్యాలని అన్నారు. ..ఎమోషనల్‌ బ్లాక్‌ మెయిల్‌ తో దేశం నాశనం అయిందని చెప్పారు. రూపాయి విలువ పతనం అయింది..ఎగుమతులు తగ్గిపోయాయని పేర్కొన్నారు. ఏ ఒక్క వర్గానికి కూడా మేలు జరగలేదని అన్నారు. డిల్లీలో దీక్ష జరిగితే ప్రాణాలు పొట్టన పెట్టుకున్న వ్యక్తి మోడీ అని దుయ్యబట్టారు. ప్రజల మధ్యన చీలికలు తెచ్చి …కార్పొరేట్ల కోసం కోట్ల రూపాయలు అప్పగిస్తున్నారని, డబ్బాల రాళ్ళు వేసి ఊపినట్టు తప్ప చేసిందేమీ లేదని అన్నారు. ఆనాడు రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన గడ్డ కరీంనగర్‌ అని, ఉప ఎన్నిక వస్తె నన్ను గుండెల్లో పెట్టుకున్న గడ్డ కరీంనగర్‌ అని, ఉ ద్యమంలో మర్చిపోలేని పాత్ర కరీంనగర్‌ దేని గుర్తు చేశారు. ప్రతీ జిల్లాలో నవోదయ పాఠశాల ఇవ్వాలని కోరితే ఒక్కటి కూడా ఇవ్వలేదని..ఒక్క మెడికల్‌ కళాశాల కూడా ఇవ్వలేదని తెలిపారు.

kcr roadshow in karimnagar
kcr roadshow in karimnagar

ప్రాజెక్టు లకు జాతీయ హోదా ఇవ్వకుండా..నా మెడ మీద కత్తి పెట్టు మీటర్లకు మోటార్లు పెట్టాలని షరతు విధించాని, నువ్వు ఏమన్నా చేసుకో నేను మీటర్లు పెట్టను అని చెప్పానని తెలిపారు. నలుగురు ఎంపీలు గెలిచి నాలుగు రూపాయల పని చేయలేదని విమర్శించారు. మేధావి అయిన వినోద్‌ కుమార్‌ ను పంపాలని..ఇప్పటికే నష్టపోయామని..మరోసారి మోసపోవద్దని కోరారు. కాంగ్రెస్‌ పార్టీ అర చేతిలో వైకుంఠం చూపించి నోటికొచ్చిన హామీలతో గద్దెనెక్కారని, అన్నారు. 2500 ప్రతీ మహిళకు ఇస్తున్నాం అని రాహుల్‌ గాంధీ అబద్దాల మాటలు చెప్పారని, ఒక్కరికీ రూపాయి కూడా రాలేదు..వచ్చే పరిస్థితి కూడా లేదని అన్నారు. కరీంనగర్‌ కు ఎప్పుడు వచ్చిన అద్భుతమైన స్వాగతం పలికారని తెలిపారు. నా సర్వే ప్రకారం వినోద్‌ కుమార్‌ గెలుపు ఖాయం అని, 8 శాతంతో ముందు వరుసలో ఉన్నారన్నారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page