Friday, March 13, 2026

Telangana Congress: విజయశాంతి, బండ్ల గణేశ్ ఎక్కడ?

Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ లో ఇద్దరు నేతలపై తెగ చర్చ జరుగుతోంది.  లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల ముందు హడావుడి చేసిన ఆ ఇద్దరు ఇప్పుడు సైలెంట్ అయిపోవడం పై తీవ్రంగా చర్చించుకుంటున్నారు.  వీరిలో ఒకరు విజయశాంతి కాగా.. మరొకరు బండ్ల గణేష్.

తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన విజయశాంతి  మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తన మాటలతో  బండ్ల గణేష్ ప్రత్యేకంగా నిలిచారు. ఈ ఇద్దరు ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నా.. ప్రస్తుతం సైలెంట్లో ఉండడంతో వారు ఏం చేస్తున్నారనే చర్చ జరుగుతుంది. మెదక్ పార్లమెంటు నుంచి విజయశాంతి పోటీ చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ ఆమె పేరు ప్రకటించలేదు. అయితే ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నా.. విజయశాంతి మాత్రం ఎక్కడ పార్టీ కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం లేదు. తనదైన మాటలతో అందరిని ఆకట్టుకునే విజయశాంతి ఈసారి ప్రచారంలో కూడా కనిపించకపోవడం గమనార్హం.

ఇక ఎప్పుడు ప్రెస్ మీట్ లో  వాడీ వేడి వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే బండ్ల గణేష్ సైతం సైలెంట్ ఆయిపోవడం ఆసక్తిగా మారింది. నామినేటెడ్ కోటాలో ఎమ్మెల్సీ దక్కించుకోవడానికి  ఆయన ప్రయత్నించారు. ఆ తర్వాత రాజ్యసభ ఎంపీ పైన  కన్నేశారు.  ఫైనల్ గా లోక్సభ ఎన్నికల్లోపోటీ చేయాలని అనుకున్నారు.  మల్కాజ్గిరి లేదా ఖమ్మం నుంచి పోటీ చేస్తారని అనుకున్నారు. కానీ ఆ ఆశలు కూడా నెరవేరలేదు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page