Andhrapradesh Election 2024: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి మంచి క్రేజీ ఉందన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి దాదాపు 40 సంవత్సరాలుగా తనదైన సేవలు అందిస్తూ సినిమా ఇండస్ట్రీలో ముందుకు వెళ్తున్నారు. ఇలాంటి క్రమంలోనే చిరంజీవి తమ్ముడుగా పవన్ కల్యాణ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తనదైన ముద్ర వేసుకున్నాడు. ఆ తర్వాత 2014లో జనసేన పార్టీని పెట్టారు. ఇప్పుడు టీడీపీ, బీజేపీలతో కలిసి ఎన్నికల్లో పాల్గొంటున్నారు.
ఈనెల 13వ తేదీన జరగబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఆయన విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. తమకు ప్రజల నుంచి మద్దతు బాగా అందుతున్నట్లు ఆ పార్టీ నాయకులు తెలుపుతున్నారు. ఇదే సమయంలో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ పవన్ వెంటే ఉన్నట్లు తెలుస్తోంది. పవన్ కల్యాణ్ కోసం సీనియర్ హీరో చిరంజీవితో పాటు కొందరు నటులు ఆయనకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. రీసెంట్ గా చిరంజీవి తన తమ్ముడైన పవన్ కళ్యాణ్ కి ఓటు వేసి గెలిపించామని ఓ వీడియో రిలీజ్ చేయడం ఆసక్తిగా మారింది. ఆయనతో పాటు పవన్ కల్యాణ్ కు మద్దతుగా రాంచరణ్ సపోర్టుగా ఉంటున్నట్లు ప్రకటించారు. సాయి ధరమ్ తేజ్ ఏకంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. హనుమాన్ సినిమాతో సక్సెస్ అందుకున్న తేజ సజ్జా సైతం త్వరలో బిగ్ డే రానుందని ప్రకటించడం ఆసక్తిగా మారింది.